ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి వెళ్లి వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు. వృద్ధులు పెంచిన పెన్షన్ వస్తుందా లేదా అని అడిగి తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.