చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 38 మంది వద్ద నుంచి అర్జీలను స్వయంగా ఎస్పీ స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు.