మచిలీపట్నం: స్నానాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి

68பார்த்தது
మచిలీపట్నం: స్నానాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి
ఈ నెల 15న జరిగే కార్తీక పౌర్ణమి పుణ్య సముద్ర స్నానాలు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గనుల, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం కార్తీక పౌర్ణమి స్నానాలకు సంబంధించి మచిలీపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్నానాలు చేయటానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ డీకే. బాలాజీ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி