కృష్ణా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా డిఎస్పి ఎన్. సురేష్ కుమార్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావుని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. 1991 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీసు శాఖలో చేరిన ఆయన వివిధ పోలీస్ స్టేషన్లలో వివిధ హోదాలలో పని చేసి, 2018లో డిఎస్పిగా పదోన్నతి పొందారు.