భోగిరెడ్డిపల్లి నుంచి మంగళాపురం రాకపోకలు బంద్

70பார்த்தது
మచిలీపట్నం నియోజకవర్గం భోగిరెడ్డిపల్లి నుంచి మంగళాపురం వరకు బుధవారం ఉదయం రాకపోకలు నిలిచిపోయాయి. వర్షపు నీరు ఎగువ నుంచి అధికంగా రావడంతో రహదారి మొత్తం జలమయయంగా మారింది. ప్రజలు కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. డ్రైన్లలో తూటుకాడ పెరిగిపోవడంతో వర్షపు నీరు కదలని పరిస్థితుల్లో గ్రామాల్లోకి ఈ నీరంత వచ్చి చేరుతుందని ప్రజలు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி