ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ గా కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరడంతో జగ్గయ్యపేట నియోజకవర్గ వైసిపి ఇన్ చార్జ్ గా తన్నీరు నాగేశ్వరరావు నియమితులయ్యారు.