పెనుగంచిప్రోలు మండలంలోని ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు గురువారం వైసిపికి రాజీనామా చేసి మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో జనసేనలో చేరారు. పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ వైస్ యంపిపి, కొణకంచి ఎంపీటీసీ కనగాల శ్రీనివాసరావు, పెనుగంచిప్రోలు–2 ఎంపీటీసీ సుశీల, నవాబుపేట ఎంపీటీసీ మాతంగి శాంతకుమారి, లింగగూడెం ఎంపీటీసీ బరిగెల వెంకట్రామయ్య, అనిగండ్లపాడు–2 ఎంపీటీసీ దోసపాటి స్వర్ణలత జనసేన పార్టీలో చేరారు.