ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎల్ఐసి కార్యాలయం ఎదుట నియాపి ఆధ్వర్యంలో బుధవారం ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఏజెంట్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఉంచాలని పాలసీదారులు చెల్లించే ప్రీమియంపై జిఎస్టిని ఎత్తి వేయాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు.