గ్రామాలలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ తాతయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ కమ్ డ్రైన్స్, గౌరవరంలో 50 లక్షలతో సిసి రోడ్లు కమ్ డ్రెయిన్స్ నుఉపాధి హామీ నిధులు 5 కోట్లుతో పనులకు శ్రీకారం చుట్టింది.