ఇటీవల మృతి చెందిన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు దేవయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహ్మద్ పేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కురుమార్తి దేవయ్య కుటుంబాన్ని శుక్రవారం ప్రజాసంఘాల నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను దేవయ్య కుటుంబం ఆర్థిక పరిస్థితుల్ని, మృతి చెందిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.