భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పర్వదిన వేడుకలను జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పరిసర ప్రాంతాల్లో పుట్టలో పాలు పోసేందుకు భక్తులు పోటెత్తారు. వివిధ చోట్ల పుట్టలో పాలు పోస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనితో పలు ప్రాంతాలలో పండుగ వాతావరణం నెలకొంది.