గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా అధికారులు ప్రోటోకాలను ఉల్లంఘిస్తున్నారని వెంకట రాఘవపురం సర్పంచ్ కాకరాల సురేష్ ఆగ్రహ వ్యక్తం చేశారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం పేయ్యల ఆదాము అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే అధికారుల తీరుపై వెంకట రాఘవపురం సర్పంచ్ కాకరాల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.