ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తూట్లు పొడిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను బుధవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు.
నాణ్యత లేని అన్నం, కూరలు చూసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.