మంగళూరులో సెప్టెంబర్ 10 నుండి 13 వరకు 77వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ జాతీయ పోటీలలో కృష్ణా జిల్లా కంకిపాడు వాసి జి. సంపత్ కుమార్ యాదవ్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్లో 08: 28. 35 కాల నిడివితో కాంస్య పతకాన్ని సాధించినట్లు ఏపీ ఆక్వాటిక్స్ సంఘం కార్యదర్శి మోహన వెంకటరామ్ ఆదివారం తెలిపారు. సంపత్ కి ఉత్తమ శిక్షణ ఇచ్చి ఆక్వాటిక్స్ లో చరిత్ర సృష్టించిన పల్నాడు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జి. సురేష్ ని అభినందించారు.