గత కొద్దిరోజులుగా వస్తున్న వరద ప్రభావానికి కోడూరు మండలం హంసలదీవి పవిత్ర సాగర సంగమ ప్రదేశం వద్ద ఉన్న కృష్ణవేణమ్మ పాదాలు కోతకు ఆదివారం గురయ్యాయి. కృష్ణవేణమ్మ పాదుకుల వద్ద నుంచి సుమారు 6 మీటర్ల దూరాన ఉన్న కృష్ణానదికి వరద తీవ్రత అధికంగా ఉండటంతో ఆ ప్రదేశం అంతా కోతకు గురై కృష్ణవేణమ్మ పాదాల వద్దకు నీరు చేరుతుంది. కృష్ణవేణమ్మ విగ్రహంతో సహా కృష్ణా నదిలో కలిసిపోయే ప్రమాదం ఉందని భక్తులు వాపోతున్నారు.