చల్లపల్లి: మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని ధర్నా

53பார்த்தது
చల్లపల్లి మండలం రామానగరం గ్రామంలో ఊరి మధ్యన వైన్ షాపు వద్దు అని స్థానికులు గురువారం సాయంత్రం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలిపారు. కనీసం మహిళలు నడిచి వెళ్లేందుకు కూడా వీలు ఉండదని, తమ ఇబ్బందులు అర్థం చేసుకుని షాపును ఊరి బయటకు మార్చాలని కోరారు.

தொடர்புடைய செய்தி