గుంటూరు జిల్లా రాజుకాల్వ - ఎదురుమొండి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది మీదుగా ఎదురుమొండి చెరువుకు వచ్చే రెండు పైపులైనులో ఇటీవల ఉధృతంగా వచ్చిన భారీ వరదలకు ఒక పైపులైను తెగిపోయిందని గ్రామ పెద్దలు గురువారం తెలిపారు. దీంతో ఒక పైపులైను నుంచే ప్రస్తుతం నీరు వస్తుందని వారు తెలిపారు. రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు అరకొరగా అందుతుందని, తక్షణమే పైపులైనును పునరుద్ధరించాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.