రాజోలు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో శనివారం వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ పూజలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు మతాలను రెచ్చగొడుతున్నారని గొల్లపల్లి ఆరోపించారు. జడ్పీటీసీ మట్టా శైలజ, మండల శాఖ అధ్యక్షులు కట్టా శ్రీనివాస్, దార్ల పెదబాబు, అడబాల జానకిరామ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.