రాజమండ్రి నగర ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని క్వారీ సెంటర్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజల నుంచి వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.