రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 141 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె జిల్లా అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.