మండపేట: మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మహిళలు, బాలికల రక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మండపేట టౌన్ ఏఎస్ఐ చిన్నారావు సూచించారు. మండపేట వైష్ణవి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో బుధవారం విద్యార్థినులకు, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎక్కడైనా వేధింపులు గురైతే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత కోనేవీర్రాజు, మహిళా కానిస్టేబుల్ దుర్గ పాల్గొన్నారు.