ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం బీసీలకు, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు వ్యవసాయానికి పెద్దపీట వేసిందని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ అన్నారు. మండపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆర్దికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కుఅంకెలకు మించిన ప్రాధాన్యత ఉందన్నారు. కుదేలైన ఆర్థిక రంగాన్ని నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.