మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకరరావును మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదివారం పరామర్శించారు. ప్రభాకర్ రావు ఇటీవల హైదరాబాద్ లో గుండెశస్త్ర చికిత్స చేయించుకుని తిరిగివచ్చారు. ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న కామనను పల్లంరాజు పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని బయటకు రావాలని ఆయన ఆకాంక్షించారు.