జిల్లాలో పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మెడికల్, నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.