రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థినిలకు భద్రత కరువైందని షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా విమర్శించారు. ఆడపిల్లలను ఇంటి నుంచి బయటకు పంపాలంటేనే భయమేస్తుందన్నారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరగడం నిత్య కృత్యంగా మారిందన్నారు.