డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపల్ సమావేశం సోమవారం చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన వాడి వేడిగా జరిగింది. పట్టణంలోని కలవ పువ్వు సెంటర్ లో ఉన్న సర్దార్ వేగుళ్ళ వీర్రాజు విగ్రహం చుట్టూ కలువ పువ్వు డిజైన్ ను రూపొందించాలని చైర్ పర్సన్ దుర్గారాణి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో టిడిపి కౌన్సిలర్లు మార్పులను అంగీకరించ బోమంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.