డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల పరిధిలోని పలివెల శివారు పూజారిపాలెం గ్రామానికి ప్రత్యేక పంచాయతీ కావాలని కోరుతూ కొత్తపేట ఆర్. డి. ఓ. పి. శ్రీకర్ కు పూజారిపాలెం గ్రామ ప్రజలు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం బిఎస్పి నియోజకవర్గ కార్యదర్శి కుసుమే సురేష్, కాండ్రేగుల గంగరాజు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇప్పటికీ పూజారిపాలెం గ్రామాభివృద్ధికి నోచుకోలేదన్నారు.