జగ్గంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ పేరిట అన్నదానం కొనసాగుతోంది. జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ నేతృత్వంలో మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ లో పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి సోమరాయణం పేట నాయకుడు రాపిడి చిట్టిబాబు ఆర్థిక సహాయం అందించారు. దాదాపు 400 మందికి అన్నదానం అందించారు.