ద్వారకాతిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాధపురం గ్రామంలో వెంచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మరియు ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.