3 సిలిండర్ల పంపిణీపై కీలక అప్‌డేట్

63பார்த்தது
3 సిలిండర్ల పంపిణీపై కీలక అప్‌డేట్
ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కార్యచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గుర్తించింది. వీటిలో తెల్లరేషన్ కార్డుదారుల కనెక్షన్లకు పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి రూ.3,640 కోట్లు ఖర్చు అవుతుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.

தொடர்புடைய செய்தி