ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు కృషి చేసిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సోమవారం ఆయన 537వ జయంతి నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన కన్నడలో నలచరిత్ర, హరిభక్తిసార, రామధ్యాన చరిత్రే, నృసింహస్తవ, మోహన తరంగణి వంటి అనేక రచనలు చేశారు.