పుల్లంపేట తాసిల్దార్ విధుల నుంచి తొలగింపు

3639பார்த்தது
పుల్లంపేట తాసిల్దార్ విధుల నుంచి తొలగింపు
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ప్రస్తుతం తహసీల్దార్ గా పనిచేస్తున్న చిట్టి బోయిన నరసింహులు ను విధుల నుంచి తొలగించినట్టు సి. సి. యల్ ఉత్తర్వులు జారీచేశారు. గత జనరల్ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఇంచార్జీ ఉన్న సమయంలో భూములు అన్యాక్రాంతం జరిగిన ఘటనలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు ఆన్‌లైన్ చేసిన ఘటనలో ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. కాగా చిట్టి బోయిన నరసింహులు విధుల నుంచి తొలగింపు ను ఆర్డీవో కోదండ రామిరెడ్డి ధ్రువీకరించారు. కాగా కడప జిల్లా సిద్దవటం మండలంలో తహసీల్దార్ రామ కుమారి అవినీతి ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరపు నాయని పల్లె మండల తహసీల్దార్ ఈశ్వరయ్య ను సి. సి. యల్. ఏ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. దీనితో అవినీతి తహసీల్దార్ ల గుండెల్లో గుబులు బయలుదేరింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி