రైల్వేకోడూరు మండలం సిద్ధారెడ్డిపల్లి గ్రామంలోని అంకాలమ్మ ఎస్టీ కాలనీలో, ఓబులవారిపల్లి మండలం వై.కోట గ్రామంలోని తిరుగుడుపల్లి హరిజనవాడలో గ్రామస్తులు కోరిక మేరకు మాజీ ఎమ్మెల్సీ,
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు సొంత నిధులతో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయం నిర్మిస్తున్న కార్మికులతో మాట్లాడి త్వరితగతిన దేవాలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సూచించారు.