రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి దళితులకు 1992లో ఇచ్చిన పట్టా భూములను వెంటనే ఆన్ లైన్ చేసి పాసు బుక్కులు ఇవ్వాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య కోరారు. సోమవారం రైల్వే కోడూరు ఎంఆర్ఓ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992లో పట్టాలి ఇచ్చి ఇప్పటివరకు ఆన్ లైన్ చేయకపోవడం అన్యాయమని అన్నారు.