పులివెందుల పట్టణ పరిధిలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బుధవారం మధ్యాహ్నం చౌడు మిద్దె కూలిపోయింది. కౌన్సిలర్ కాంతమ్మకు చెందిన ఇల్లు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కూలిపోయింది. ఈ ప్రమాదం వలన సుమారు రూ. 2 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపారు. వర్షాలకు నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుకుంటోంది.