కడప జిల్లాలో ఉల్లి పండిస్తున్న రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ డిమాండు చేశారు. ఆదివారం మైదుకూరులో ఉల్లి రైతులతో చర్చించి వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర గణనీయంగా తగ్గి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేసి క్వింటాల్ రూ. 2500 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండు చేశారు.