పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల రోగాలు దరి చేరవని పిహెచ్ సి విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, సూపర్ వైజర్ శోభా కుమారి అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో భాగంగా శుక్రవారం ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో పిహెచ్ సి సిబ్బంది ఫీవర్, లార్వా సర్వే నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. లార్వా సర్వేలో భాగంగా తొట్లు, కుండలు, నీటి డ్రమ్ములు, వీధి రోళ్లలో నీటిని పారవేసి శుభ్రం చేయించారు.