గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులకు, భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్న కాశి నాయన మండలం కాశినాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలను, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బుధవారం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవు కలసి జ్యోతిక్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.