ఆధునిక టెక్నాలజీని మంచికే ఉపయోగించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి. వెంకట సుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. బద్వేల్ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ 10వ కడప జిల్లా మహాసభలలో భాగంగా 'నేటి టెక్నాలజీ -విద్యార్థుల భవిష్యత్తు' అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం టెక్నాలజీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని తెలిపారు.