ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నర్సింహారెడ్డి అన్నారు. బి కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం క్యాన్సర్ సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఇంట్లో వారికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తుందని వీటిని చేయించుకోవాలని తెలిపారు.