అట్లూరు పరిధిలో రైతు సేవా కేంద్రం ఇన్ ఛార్జ్ రైతులకు అందుబాటులో ఉండి రైతు సమస్యలు పరిష్కరించాలని ఏడీఏ నాగరాజు అన్నారు. డివిజన్ పరిధిలోని పెద్దపల్లి రైతుసేవా కేంద్రాన్ని బుధవారం ఏడీఏ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. పీఎం కిసాన్ లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ రాయితీలను రైతులకు అందేలా చూడాలని కోరారు.