ఏపీ ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. డిసెంబర్ 9 నుంచి ఏపీలో సీప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించారు. తొలుత ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాలను ఒకే రోజు అతి తక్కువ ఖర్చుతో దర్శించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.