గుంటూరు: వైన్ షాపులకు అత్యధిక దరఖాస్తులు

56பார்த்தது
గుంటూరు: వైన్ షాపులకు అత్యధిక దరఖాస్తులు
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే విజయవాడ తర్వాత రాజధానిలో వైన్ షాపులకు అత్యధికంగా టెండరు దరఖాస్తులు వచ్చాయి. తుళ్లూరులో 4 షాపులకు టెండర్లు ప్రకటించగా ఒక్కో షాపునకు ఆన్లైన్లో దరఖాస్తులు 120 వరకు వచ్చాయి. మాన్యువల్ దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో షాపునకు 150 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు టెండర్లకు అప్లికేషన్ల పక్రియ కొనసాగింది.

தொடர்புடைய செய்தி