రేపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 ఫిర్యాదులు అందినట్లు ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతి సోమవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ కోరారు.