చేబ్రోలు: పోలీస్ అంటూ యువతిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్టు
కానిస్టేబుల్ అని చెప్పి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని కొత్తపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు లాలాపేటలోని ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన పోతినేని గోపీ వ్యవసాయం చేస్తుంటాడు. యువతీపై దారుణానికి ఒడిగట్టింది అతనేనని చెప్పారు. చైన్ స్నాచింగ్, గంజాయి ఇలా 23 కేసులు గోపీపై ఉన్నాయన్నారు.