ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నైపుణ్య గణన-2024లో భాగంగా పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీ ఎస్ ఎస్ డి సి సంస్థ ప్రతినిధి వి మణికంఠ గోపాల్ పాల్గొని నైపుణ్య అభివృద్ధి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. మండల ఎంపీడీవో చంద్రశేఖర్ మండలం లోని అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.