పీఎం సేవ నిధి అవార్డు అందుకున్న పొన్నూరు మున్సిపల్ కమిషనర్

76பார்த்தது
పీఎం సేవ నిధి అవార్డు అందుకున్న పొన్నూరు మున్సిపల్ కమిషనర్
రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక పరిపుష్టికి చేయూతనిచ్చే పిఎం సేవ నిధికి పొన్నూరు మున్సిపాలిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతుల మీదగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అవార్డును అందుకున్నారు. పొన్నూరు పట్టణంలో 1775 మంది వీధి వ్యాపారులకు 2. 20 కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.

தொடர்புடைய செய்தி