పొన్నూరు పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో త్రాగునీరు సరఫరా, పారిశుధ్యం పనులను పరిశీలించారు. 24వ వార్డులో తాగునీరు నమూనాలు తీసి సిబ్బంది పరీక్షించారు. పట్టణంలో స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల పేర్కొన్నారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ను ఆదేశించారు.