పెదకూరపాడు మండలంలోని పరస గ్రామంలో పండ్ల తోటలను జిల్లా డ్వామ పీడి లింగమూర్తి గురువారం పరిశీలించారు. పెదకూరపాడులోని సిమెంటు రోడ్లను కూడా పరిశీలించారు. ఆయన మండల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఏపీవో కే కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మస్తాన్వలి, పరస క్షేత్ర సహాయకులు వలి పాల్గొన్నారు.