పర్చూరు ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదంలో గణపవరం గ్రామానికి చెందిన జంపని ప్రసాద్ (40) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. చీరాల నుండి పర్చూరు వెళ్తూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద డైవర్షన్ గమనించకపోవడంతో ద్విచక్రవాహనం బ్రిడ్జిలోకి దూసుకెళ్లి, తల కాంక్రీట్ గోడకు తగలడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పర్చూరు ఎస్ఐ మాల్యాద్రి విచారణ చేపట్టారు.